01-03-2025 10:31:50 PM
ముషీరాబాద్,(విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాను సారం శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని కవాడిగూడ, భోలక్పూర్, గాంధీనగర్ ముషీరాబాద్, అడిక్మెట్, రాంనగర్ డివిజన్లో ఆయా బస్తీలు, కాలనీల అధ్యక్షులు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్జల రాజశేఖర్ మాదిగ, ముషీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, రావుల వివేక్ మాదిగ, గంగాధరి మహేష్ కుమార్ మాదిగ, బండారి యాదగిరి మాదిగ, మిట్ట గడపల రవీందర్ మాదిగ, దేశ్ పాండే నాగరాజు మాదిగ, తొట్ల గోపి మాదిగ, కుమ్మరి శ్రీనివాస్ మాదిగ, వెంకటేష్ మాదిగ, మహంకాళి వెంకటయ్య మాదిగ, గడ్డం రమేష్ మాదిగ, కుంబర్తి శివ మాదిగ, సుధాకర్ మాదిగ, రాములు మాదిగ, P.విజయ్ కృష్ణ మాదిగ, కుమార్ మాదిగ, Et.మల్లేష్ మాదిగ, ET.రమేష్ మాదిగ, శ్రీకాంత్ మాదిగ, మనోజ్ మాదిగ, సురేందర్ మాదిగ, ఇందూరి సాయి మాదిగ, మల్లయ్య మాదిగ, B.నరసింహారావు మాదిగ, జయదేవ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకులు బస్తీ నాయకులు పాల్గొన్నారు.