జుక్కల్ ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో సమాఖ్య సభలో ఎస్ సి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మాదిగ సామాజికవర్గ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావును శుక్రవారం రోజు సన్మానించారు.
నియోజకవర్గంలోని మాదిగ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమై, వర్గీకరణ సాధనలో తన సహాయం అందించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.