* ప్రకటించిన ఎస్జీటీయూ టీచర్ సంఘం
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): సెంకడరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్జీటీయూ) సంఘం తరఫున కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంకినేని మధుసూదన్‌రావును ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం తెలిపారు. పట్టభద్రులు, ప్రాథమిక పాఠశాలల్లోని సమస్యలు, ఎస్జీటీ ఉపాధ్యాయుల పక్షాన గొంతును శాసనమండలిలో వినిపిం చేందుకు కృషి చేస్తానని సంకినేని మధు సూదన్‌రావు తెలిపారు.
గత ప్రభుత్వహయాంలో నోషనల్ ఇంక్రిమెంట్స్ సాధించటంలో, పాఠశాలలకు సర్వీస్ పర్సన్స్ నియమిండంలో ఎస్జీటీయూ పాత్ర మరువలేనిదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యారంగ సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నిస్తానని, ఇం దుకు రాబోయే ఎన్నికల్లో తనకు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు మద్దతు తెలుపాలని బుధవారం ఒక ప్రకటలో ఆయన కోరారు.