12-03-2025 09:14:57 PM
ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ అనుబంధం సంస్థ ‘టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా’ రంగారెడ్డి జిల్లా ట్రెజరర్‌గా సూరేపల్లి మధుసూదన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామం ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన రెండో మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, జిల్లా అధ్యక్షుడు సలీం ప్రకటించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ..19 ఏండ్లుగా ‘TV5’ రిపోర్టర్ గా పని చేస్తూ రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ సెక్రటరీగా పనిచేశానని, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ట్రెజరర్‌గా ఎన్నికైనట్లు తెలిపారు. జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మధుసూదన్చెప్పారు. తనపై నమ్మకంతో ఈ పదవీ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.