calender_icon.png 8 October, 2024 | 10:07 AM

జీజేఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా మధుసూదన్‌రెడ్డి

07-10-2024 12:27:51 AM

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసొసియేషన్ (జీజేఎల్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, రాష్ట్ర విద్యా కమిషన్ అధ్యక్షుడు ఆకునూరి మురళి ముఖ్యఅతిథులుగా నిర్వహించిన సంఘం రాష్ట్ర కౌన్సిల్ మూడో సమావేశంలో ఈ మేరకు సంఘం సభ్యులు ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.

అలాగే సంఘం ప్రధాన కార్యదర్శిగా బలరాం జాదవ్, అసొసియేట్ అధ్యక్షుడిగా ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఉపా ధ్యక్షులుగా ఎస్ శ్రీనివాస్, జీ సత్యపాల్‌రెడ్డి, జీ వేణుగోపాల్, టీ శ్రీధర్, ఎన్ రమేశ్, వీ అశోక్, సంయుక్త కార్యదర్శిగా ఎం విజయశేఖర్, ఆర్థిక కార్యదర్శిగా ఏ శివప్రసాద్, మహి ళా కార్యదర్శిగా ఎస్ పద్మావతి, రాష్ట్ర కార్యదర్శులుగా వీ ప్రమీల, ఏఏవీ ప్రసాద్, ఎం హరిప్రసాద్, ఫహీముద్దీన్, జీ మధు, కే శ్రీదేవి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో విద్యకు కేవ లం 7.5 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. సర్కార్ రాష్ట్రంలో 1023 విద్యా విధానాన్ని యాథావిధిగా కొనసాగించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్య అస్తిత్వాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.