23-02-2025 12:35:04 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతో పాటు తాజాగా నిర్వహించిన కులగణన, దానికి ప్రజల్లో వచ్చిన స్పందనను మధుయాష్కీ, రాహుల్‌కు వివరించారు. ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉందని రాహుల్‌గాంధీ యాష్కీని అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. అయితే కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీకి చెందిన బీసీ నేతలతో సమావేశం నిర్వహించగా, మధుయాష్కీ మాత్రం ఆ మీటింగ్‌కు రాకుండా ఢిల్లీకి వెళ్లి రాహుల్‌తో భేటీకావడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది.