calender_icon.png 1 November, 2024 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పడం లేదు : మధు యాష్కీ

15-07-2024 08:04:09 PM

హైదరాబాద్ : ఏఐసీసీ సూచనల మేరకే ఇతర పార్టీల నేతల చేరికలు జరుగుతున్నాయని మధు యాష్కీ గౌడ్ తెలిపారు. గతంలో భట్టి విక్రమార్కకి ప్రతిపక్షనేత హోదా ఉండకూడదనే సీఎల్పీని విలీనం చేశారని, మేము డబ్బులు ఇచ్చి ఎవరినీ చేర్చుకోవట్లేదని మధు యాష్కీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ మంత్రులను చేసిందని ఆయన స్పష్టం చేశారు.

ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమైనా.. అనివార్యం అయ్యిందన్నారు. మంత్రి పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పడం లేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కోసం బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని కలిపాలని చూస్తున్నారని యాష్కీ పేర్కొన్నారు.బీఆర్ఎస్, బీజేపీ విలీనంపైనే దిల్లీలో మంతనాలు జరుగుతున్నాయని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. హరీశ్ రావుపై బండి సంజయ్ ప్రేమ ఒలకపోయాడానికి కారణం అదే అన్నారు.

బీఆర్ఎస్ విలీనాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు వద్దంటున్నారు. కేసీఆర్ తప్పు లేకపోతే కమిషన్ రద్దుకు సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారని మధు ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించాలని అధికారులు కోరుతున్నారని, కేసుల నుంచి తప్పిస్తే రూ. వందల కోట్లు ఇస్తామంటున్నారని ఆయన కొనియడారు. ప్రభుత్వంలోని పెద్దల చుట్టూ అవినీతి అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారని మధు యాష్కీ వెల్లడించారు.