05-04-2025 07:45:35 PM
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీసిపిఎల్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంటును శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపొందిన జట్టులకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా యాబై వేల రూపాయలు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రధానం చేస్తారని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిలుకల రాయకోమురు, కొత్తపెల్లి రాము, గంగాధరి రవీందర్, సిసిపిఎల్ సీజన్ 3 నిర్వాహకులు ఇరుకులపాటి వినయ్ కుమార్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.