calender_icon.png 8 January, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాధవన్ మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు

31-12-2024 01:35:42 AM

  1. పీసీసీ మాజీ చీఫ్ వీహనుమంతరావు
  2. కేరళలో బాధిత కుటుంబసభ్యులకు పరామర్శ

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్ ఇటీవల మృతి చెందాడు. దీంతో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను  పరామర్శించారు.

40 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన ఎంతో పని చేశారని.. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ వద్ద పర్సనల్ సెక్రరీగా పనిచేశారని తెలిపారు. రాజీవ్, సోనియాను పార్టీ సమస్యలపై కలిసేందుకు వెళ్లిన వారిని ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేసుకున్నారు. మాధవన్ మరణం పార్టీకి తీరని లోటన్నారు. మాధవన్‌తో ఉన్న తన స్నేహాన్ని ఆయన కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావించారు.