బెల్లంపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ గా మాదరి శ్రీధర్ నియమితులయ్యారు. బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) చేతుల మీదుగా మాదరి శ్రీధర్ తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ... కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బెల్లంపల్లి ప్రాంతంలో కార్మికుల సమస్యలను తీర్చడంలో ముందుండి కృషి చేయాలని బెల్లంపల్లి ఐఎన్టియుసి టౌన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన మాదరి శ్రీధర్ కు సూచించారు. ఈ సందర్భంగా ఐఎన్టి యుసి జనరల్ సెక్రటరీ, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు రామిశెట్టి నరేందర్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, తాళ్ల కృష్ణమోహన్, బండి రామ్ కు మాదరి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.