జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో నిందితుడైన మద్దూరి విజయ్‌ని న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 1.30 మధ్య న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని మద్దూరి విజయ్ మంగ ళవారం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటూ కోరారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యాపార వ్యవహారాల్లో భాగంగా విదేశీ ప్రయాణాలు కూడా చేస్తుంటారని చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల నెదర్లాండ్స్ నుంచి వచ్చారని, వచ్చి న వెంటనే దీపావళి వేడుకల్లో పాల్గొనాలన్న పాకాల రాజ్ ఆహ్వానంతో కుటుంబ సమేతంగా వెళ్లారని తెలిపారు.
అక్కడ ఉండగా పోలీసులు దాడులు జరిపి మూత్రం శాంపిల్స్ తీసుకున్నారని, ఇందులో కొకైన్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందని కేసు నమోదు చేశారన్నారు. దేశంలో నిషేధించిన కొకైన్‌ను విజయ్ తీసుకోలేదని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పిటిషనర్‌ను వాడుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 4న బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 (3) కింద నోటీసు ఇచ్చి రెండు రోజుల్లో హాజరుకావాలని పోలీసులు ఆదేశించారని, అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని, కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేగాకుండా పిటిష నర్ అమెరికా పౌరుడని, ఇక్కడి కేసు విషయంపై హైదరాబాద్‌లోని అమెరికా ఎంబసీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ అమెరికా పౌరసత్వం ఉందని ఇక్కడి చట్టాలను ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్పారు. కొకైన్ తీసుకున్నట్టు పాజిటివ్ నివేదిక వచ్చిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్ న్యాయవాది సహా బుధవారం ఉద యం 10.30 గంటల నుంచి 1.30 వర కు పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.