calender_icon.png 6 October, 2024 | 6:02 PM

కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డి నియామకం

06-10-2024 03:14:11 PM

కాంగ్రెస్ పార్టీకి సేవలందించినందుకు తగిన గుర్తింపు

గ్రంథాలయల సమస్యలను పరిష్కరిస్తా

నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన చంద్రకాంత్ రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎవరు ఎన్నిక అవుతారనే ఉత్కంఠకు తెరపడింది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి గ్రామ సర్పంచ్ గా ఎంపిటిసి సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మద్ది చంద్రకాంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కార్పొరేషన్ పదవిని కట్టబెడుతుందని భావించిన ప్పటికీ ఎట్టకేలకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేస్తున్న మద్ది చంద్రకాంత్ రెడ్డి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో కృషి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ హార్నిశలు కష్టపడ్డారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ గా నియమించడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాం సార్ మండలానికి చెందిన ప్రదీప్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోసం పోటీపడ్డారు.

కామారెడ్డికి చెందిన ఐరేని సందీప్ కుమార్, చంద్రశేఖర్, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మరో ఇద్దరు జిల్లా గ్రంథాలయ  సంస్థ చైర్మన్ పదవి కోసం కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలికి నమ్మిన బంటుగా ఉన్న మద్ది చంద్రకాంత్ రెడ్డినీ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి జిల్లాలోని ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రంధాలలో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తానని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉండేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.