ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేసిన పేస్ హాస్పిటల్ సిబ్బంది
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మరణించిందని ఆరోపిస్తున్న బంధువులు...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న క్రమంలో లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ (60) అనే మహిళను పేస్ హాస్పటల్ లో సోమవారం చేర్చారు. హాస్పిటల్ లో చేర్చుకునే సమయంలో రెండు లక్షల 20 వేలు కట్టించుకున్నారు. మంగళవారం ఉదయం ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని పేస్ జనవరి 1న డిశ్చార్జ్ చేస్తామని కూడా డాక్టర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేయకుండా ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఇంకా మూడు లక్షలు చెల్లించాలని పేస్ హాస్పిటల్ సిబ్బంది హుకుం జారీ చేశారు. ఇక ఆ మూడు లక్షలు హాస్పిటల్లో డిపాజిట్ చేయడానికి వెళ్లగా ఎల్లమ్మ చనిపోయిందని హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు. ఈ క్రమంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే హాస్పిటల్ సిబ్బంది మాత్రం మూడు లక్షలు కడితేనే బాడీని ఇస్తామని తేల్చారు. ఈ నేపథ్యంలో బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకి దిగారు.