calender_icon.png 16 January, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తడి దుంకుతున్న మాదన్నపేట చెరువు

08-08-2024 03:52:48 AM

 హనుమకొండ, (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంలో జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. నర్సంపేట మండంలోని మాదన్నపేట చెరువు మత్తడి దుంకుతున్నది. అలాగే ఖానాపురం మండలంలోని పాకాల చెరువులోకి భారీగా వరద చేరుతోంది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 30 అడుగులకు, ప్రస్తుత నీటిమట్టం 29.6 అడుగులకు చేరుకున్నది. చెరువులు మత్తడి పోస్తున్నందును పోలీసులు అప్రమత్తమయ్యారు. వాగులు, చెరువులు పొంగిన చోట రాకపోకలు కొనసాగించొద్దని హెచ్చరిస్తున్నారు.