calender_icon.png 19 January, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 29న మ్యాడ్ స్క్వేర్

19-01-2025 12:00:00 AM

ముగ్గురు స్నేహితులను చుట్టూ తిరిగే కథతో వచ్చిన ‘మ్యాడ్’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం రూపొందుతోంది. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు బాగా సక్సెస్ అయ్యాయి.

కాగా.. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. “మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్‌” అని నిర్మాతలు పేర్కొన్నారు.

కల్యాణ్ శంకర్ దర్శకత్వంలోనే ‘మ్యాడ్ స్కేర్’ కూడా రూపొందుతోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్’ చిత్రాన్ని మించి ‘మ్యాడ్ స్కేర్’ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.