03-03-2025 12:58:10 AM
‘మ్యాడ్’ను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు కళ్యాణ్‌శంకర్. మరోసారి ‘మ్యాడ్ స్కేర్’ అంటూ సీక్వెల్‌తో నవ్వుల విందు పంచేందు కు సిద్ధమయ్యారాయన. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ఇప్పు డు పార్ట్ రెట్టింపు అల్లరి చేయబోతున్నారు.
కేవీ అనుదీప్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేస్తామని మేకర్స్ ఇంతకుముందు ప్రకటించారు. అయితే ఇప్పుడు గతంలో ప్రకటించిన తేదీ కన్నా ఒక రోజు ముందే అంటే.. మార్చి 28వ తారీఖునే వస్తోంది. చిత్ర సమర్పకుడు సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
మార్చి 29న అమావాస్య కావడంతో, మా పంపిణీదారులు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు’ అని తెలిపారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయగ్రహణం: శామ్‌దత్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; కూర్పు: నవీన్ నూలి.