calender_icon.png 18 April, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్జి గ్రామంలో పిచ్చికుక్కల స్వైర విహారం

11-04-2025 02:55:40 PM

4 పశువులపై దాడి 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): నెన్నల మండలం(Nennal Mandal)లోని ఖర్జీ గ్రామంలో గురువారం రాత్రి పిచ్చికుక్క(Mad dog) స్వైర విహారం చేస్తూ గ్రామంలోని పశువులపై దాడికి పాల్పడింది. గ్రామానికి చెందిన చింత నారాయణ బర్రెపై దాడి చేసింది. రావుల శ్రీనివాస్ కు చెందిన దుడ్డే, రావుల సత్యనారాయణకు చెందిన రెండు దుడ్డేలపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అదే రోజు రాత్రి బెల్లంపల్లి(Bellampalle) మండలంలోని బట్టువానుపల్లి గ్రామంలో పిచ్చికుక్క నాలుగేళ్ల చిన్నారితో పాటు నలుగురు వ్యక్తులపై దాడి చేసే గాయపరిచింది. గ్రామాలలో పిచ్చికుక్కల బెడద తీవ్రంగా మారడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు గ్రామాలలో పిచ్చి కుక్కల బెడద నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.