calender_icon.png 23 September, 2024 | 7:00 PM

లడ్డుగాని పెళ్లిలో మ్యాడ్ బాయ్స్ లొల్లి

22-09-2024 12:00:00 AM

కళాశాల నేపథ్యంలో ముగ్గురు యువకులు చేసే అల్లరి ప్రధానంగా రూపొందిన వినోదాత్మక చిత్రం ‘మ్యాడ్’ ప్రేక్షకాదరణ పొందింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ను నిర్మిస్తోంది. తాజాగా ‘లడ్డు గాని పెళ్లి” అనే బరాత్ గీతంతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిందీ చిత్రబృందం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటగా దీన్ని విడుదల చేశారు. తీన్మార్ బీట్‌లో సాగుతున్న ఈ గీతాన్ని మంగ్లీతో కలిసి భీమ్స్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం అందరూ పాడుకునేలా ఉంది. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్.. మ్యాడ్ బాయ్స్ గ్యాంగ్‌గా వినోదం పంచనున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్; నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య; ఛాయాగ్రహణం: షామ్‌దత్.