calender_icon.png 15 November, 2024 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు యంత్రాలు సరఫరా చేయాలి

13-11-2024 02:08:37 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): రైతులకు యాసంగిలో అవసరమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఐదేండ్లుగా వ్యవసాయ యాంత్రీక రణ పథకానికి కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ర్ట ప్రభుత్వం తన వాటాను విడుదల చేయలేదన్నారు.

దీంతో కేంద్రం తన వాటా నిధులను ఆపడంతోపాటు గతంలో ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింద న్నారు. దీనిపై రైతులకు అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా స్థాయిలో స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఈ సీజన్‌లోనే యంత్రాలు, పనిము ట్లను అందచేయాలన్నారు.  జిల్లాల వారిగా ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లు, యంత్ర పరికరాల జాబితాను సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ తెలిపారు.   

సోయాబిన్ సేకరణలో టాప్

రైతుల నుంచి మద్ధతు ధరకు సోయాను సేకరించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని అధికారులు తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫే ర్ జాయింట్ సెక్రెటరీ శ్యామూల్..

సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన కర్ణాటక, మహా రాష్ర్ట, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో సమావేశమై సోయాబిన్ సేకరణ గురించి వివరించారు.