మంథని (విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు మాచిడి దిలీప్ ను ఎన్‌హెచ్‌ఆర్‌సి జాతీయ మానవహక్కుల మండలి ఎన్జీఓ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షులు అయిలినేని శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గా వైద్య శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ గా ఎం కృష్ణమూర్తి, ఏ జిల్లా కో- ఆర్డినేటర్ గా డి సరిత, పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా జే ప్రభాకర్, మంథని మండల ఉపాధ్యక్షులుగా ఎం మనోజ్ కుమార్ ను నియమించారు. జాతీయమానవహక్కుల మండలి ఎన్జీఓ పెద్దపల్లి జిల్లా కమిటీ ఎన్నికకు,తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు అయిలినేని శ్రీనివాసరావు కు మాచిడి దిలీప్ కృతజ్ఞతలు తెలిపారు..మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటామని, మానవ హక్కుల పట్ల సమాజంలో మరింత అవగాహన, సమాచార హక్కు చట్టం సద్వినియోగంలో పౌరుల పాత్ర పట్ల విస్తృత ప్రచారం చేస్తామని దిలీప్ తెలిపారు.