మా సభ్యులు సున్నిత విషయాలపై స్పందించొద్దు
హైదరాబాద్: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' సభ్యులకు అధ్యక్షుడు మంచు విష్ణు ఫోన్ లో కీలక సందేశం ఇచ్చారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమ స్థిరపడడానికి చెన్నారెడ్డి సహకరించారని గుర్తుచేశారు. చెన్నారెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహించిందని తెలిపారు. ప్రభుత్వాలతో సినీ పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందని విష్ణు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 'మా' సభ్యులు సున్నిత విషయాలపై స్పందించొద్దని చూసించారు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదని మంచు విష్ణు అభిప్రామపడ్డారు. ఇటీవల ఘటనలపై చట్టం తనపని తాను చేస్తోందని 'మా' అధ్యక్షుడు వెల్లడించారు.