calender_icon.png 28 November, 2024 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా కాళి వాస్తవ కథే

28-11-2024 12:22:33 AM

టాలీవుడ్‌కు చెందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి త్వరలో రాబోతున్న ద్విభాషా చిత్రం ‘మా కాళి’. విజయ్ యెలకంటి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ పాన్ -ఇండియా చిత్రాన్ని హిందీలో చిత్రీకరించారు. 2025లో బెంగాలీ, తెలుగు భాషల్లో థియేటర్ల ద్వారా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్‌ను ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌తోపాటు గోవా డీజీపీ అలోక్ కుమార్, చిత్ర దర్శకుడు విజయ్ యెలకంటి, నిర్మాత వందనాప్రసాద్, లీడ్ యాక్టర్ అభిషేక్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీమియర్ షో ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. ప్రీమియర్ షో అనంతరం గోవా సీఎం ‘మా కాళి’ చిత్రం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “మా కాళి’ సినిమాను భారతదేశ విభజన, డైరెక్ట్ యాక్షన్ డే ఆధారంగా రూపొందించారు. నిజం చెప్పే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది” అన్నారు.