calender_icon.png 31 October, 2024 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీకి 'మా' అసోసియేషన్ ఫిర్యాదు

18-07-2024 01:37:15 PM

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ జితేందర్ కి మా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. గురువారం మా అసోసియేషన్ ప్రతినిధులు, నటులు రఘుబాబు, శివబాలాజీ డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే నటీనటులపై వివాదాస్పద వీడియోలు చేస్తున్న యూట్యూబర్లపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్, మా అసోసియేషన్, నటీనటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని విజ్ఞప్తి  చేశారు. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని మా అసోసియేషన్ డీజేపీకి అందజేసింది.