* ముంబైని వెనక్కి నెట్టేసిన దేశ రాజధాని
* ‘నైట్‌ఫ్రాంక్’ తాజా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: సాధారణంగా లగ్జరీ అపార్ట్‌మెంటు అంటే ముంబయి మహానగరంలో సముద్రపు ఒడ్డుకు ఆనుకొని ఉండే లగ్జరీ హోంలో లేదా, ‘ఇండియన్ సిలికాన్ సిటీ’గాగుర్తింపు పొందిన బెంగళూరులో విలాసవం తమైనపెంట్‌హౌస్‌లో గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ లగ్జరీ ప్రాపర్టీబూమ్ మరో నగరంలో చోటు చేసుకుంటోంది.
దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు అయిన ఢిల్లీ నగరం ఇప్పుడు హౌసింగ్ మార్కెట్లో కూడా దూసుకుపోతుండమే కాదు, ముంబయి నగరాన్ని సైతం వెనక్కి నెట్టేసింది.్ర పముఖ రియల్ ఎస్టేట్ విశ్లేషణ సంస్థ నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో ఢిల్లీలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరల్లో 6.7 శాతం వృద్ధిని నమోదు చేసి ప్రపంచంలో ఆరో స్థానానికి ఎగబాకింది.
2024 డిసెంబర్ త్రైమాసికంలో ఢిల్లీ లో ఈ రంగంలో ధరలు సగటున 6.7 శాతం పెరిగాయి.నైట్‌ఫ్రాంక్ సోమవారం నాడు ్ర‘పైమ్ గ్లోబల్ సిటీస్ క్యు4 ఇండెక్స్’ ను విడుల చేసింది. ప్రపంచవ్యాప్తంగా రెసిడెన్షియల్ ఆస్తుల ధరలు ఎలాంటి మార్పు లు చోటు చేసుకున్నాయో ఈ సూచీ వివరంగా తెలియజేసింది.
ఢిల్లీ 2013 డిసెంబర్ త్రైమాసికంలో సూచీలో 16వ స్థానంలో ఉండింది. అయితే ఏడాది కాలంలో అది ఆరో స్థానానికి చేరుకోవడం గమనార్హం. సంపన్న వర్గాలు లగ్జరీ గృహాల కొనుగోలుకు మక్కువ చూపుతుండడమే పెరుగుదలకు కారణమని నైట్‌ఫ్రాం అభిప్రాయపడింది.
మొత్తంమీద దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం కూడా హైఎండ్ ఆస్తుల మార్కెట్ పెరగడంతో కీలక పాత్ర పోషిస్తోందని కూడా నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాలను మాత్రమే పరిశీలనకు తీసుకొంది.