calender_icon.png 13 January, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.2.79 లక్షల కోట్లకు లగ్జరీ ఇండ్ల అమ్మకాలు

01-12-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, నవంబర్ 30: లైఫ్ స్టుల్ లివింగ్ కోసం మొగ్గుచూపుతున్న కొనుగో లుదార్లు పెరగడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో లగ్జరీ హౌసింగ్ మార్కెట్ శరవేగంగా వృద్ధిచెందుతున్నది. క్రెడాయ్ ఎంసీహెచ్‌ఐ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరం ప్రధమా ర్థంలో దేశంలోని టాప్ 7 ప్రాపర్టీ మార్కెట్ల లో లగ్జరీ ఇండ్ల అమ్మకాల విలువ 18 శాతం వృద్ధిచెంది రూ. 2,79,308 కోట్లకు చేరింది.

వాస్తవానికి హౌసింగ్ యూనిట్ల అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినప్పటికీ, ధరల పెరుగుదల కారణంగా అమ్మకాల విలువ అధికమయ్యింది. లగ్జరీ ఇండ్ల సగటు ధరలు నిరుడుతో పోలిస్తే రూ. 1 కోటి నుంచి రూ.1.23 కోట్లకు పెరిగాయి. ప్రీమియం ఇండ్ల విభాగంలో ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు నగరాలు ముందున్నాయి.లగ్జరీ ఇండ్ల అమ్మకాల విలువ ఒక్క ముంబై మె ట్రోపాలిటిన్ రీజియన్ (ఎంఎంఆర్)లోనే రూ.1,14,529 కోట్లుగా నమోదయ్యింది. లగ్జరీ ఇండ్ల సగ టు ధరలు ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగ ళూరుతో పాటు హైదరాబాద్, చెన్నై, పూణే ల్లోనూ పెరిగా యని క్రెడాయ్ చ్‌ఆర్‌ఐ నివేదిక వెల్లడించింది.