calender_icon.png 15 January, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లుపిన్ నికరలాభం 77 శాతం జంప్

08-08-2024 02:41:33 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఔషధ కంపెనీ లుపి న్ కన్సాలిడేటెడ్ నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 77 శాతం వృద్ధిచెం ది రూ.801 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 452 కోట్ల నికరలా భాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.4,814 కోట్ల నుంచి రూ. 5,600 కోట్లకు పెరిగింది. ఉత్తర అమెరికాలో అమ్మకాల ఆదాయం 28 శాతం వృద్ధితో  రూ. 2,041 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. భారత్‌లో అమ్మకాలు రూ.1,638 కోట్ల నుంచి రూ.1,926 కోట్లకు చేరాయన్నది.