14-04-2025 12:41:37 AM
సిరిసిల్ల,ఏప్రిల్13(విజయక్రాంతి): వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఈరోజు ఇద్దరికి మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ ఆసుపత్రులలో మోకీలు మార్పిడి ఆపరేషన్లకి వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ప్రసిద్ధి గాంచింది.
ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో42 మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలియజేశారు. ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర్లు అనిల్, శశికాంత్ మరియు మత్తు వైద్యులు డా.తిరుపతి మరియు ఇతర సిబ్బంది లను సూపరిండెంట్ డాక్టర్ పెంచలయ్య అభినందించారు.