16-12-2024 10:02:20 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన బాట పట్టారు. సీఐటీయూ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు లింగాల చిన్నన్న మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. భోజనం వండేందుకు గ్యాస్ సిలెండర్ లను సబ్సిడీపై అందించాలన్నారు.