calender_icon.png 8 February, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లకూ మధ్యాహ్న భోజనం

28-01-2025 12:00:00 AM

తెలంగాణలోనూ కాలేజీ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, సాయంత్రం టిఫిన్స్ అందించడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. ఇంటర్ వ్యవస్థ ప్రక్షాళన, ఉత్తమ ఫలితాలు రాబట్టే కార్యక్రమంలో భాగంగా ఇంటర్ బోర్డ్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తున్నది.

35 రోజులు ప్లానింగ్ ఇచ్చి వెనుకబడిన విద్యార్తులను గుర్తించి బోధన చేయడం, ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి ఇద్దరు సీనియర్ లెక్చరర్లు, ఒక లైబ్రరీని, జిల్లా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి పరిశీలించడం వంటివి ఎంతో నిర్మాణాత్మకమైనవి. జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం లేదు.

పేద, మధ్యతరగతి పిల్లలు వ్యవసాయ పనులు, ఉపాధి పనులు, ఇండ్లల్లో బీడీలు చెయ్యడం, తల్లిదండ్రులు పనులకుపోతే వంట చెయ్యడంతో పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టడం లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కనీసం ఈనెల రోజులు వారికి ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించే ప్రయత్నం చేయాలి.      

 ఉమాశేషారావు వైద్య, లింగాపూర్