17-02-2025 08:11:08 PM
పదిమంది యాత్రికులు విజేతలుగా నిలిచి ఉచిత యాత్రను కైవసం చేసుకున్నారు..
కూకట్‌పల్లి (విజయక్రాంతి): దేశంలోనే టాప్ ట్రావెల్ సంస్థల్లో ఒక్కటిగా పేరుగాంచిన ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత కొద్దీ రోజులుగా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ప్రొద్దుటూరు, నిజమాబాద్, ఖమ్మం, వరంగల్, కర్నూల్, సిద్దిపేట, కరీంనగర్ లో నిర్వహించిన ట్రావెల్ ఎక్స్పో 2025 కు అనూహ్య స్పందన లభించింది. వేలాదిమంది యాత్రికులు ఈ ఎక్స్పో ద్వారా తమకు నచ్చిన టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకుని భారీ డిస్కౌంట్లను పొందడమే కాకుండా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డిప్ లో పదిమంది విజేతలుగా గెలుపొంది ఉచిత టూర్లను బహుమతులుగా దక్కించుకున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్- కూకట్‌పల్లిలో గల తన కార్యాలయంలో సంస్థ చైర్మన్ ఆర్.వి రమణ ముఖ్య అతిథులు, కస్టమర్లు, మీడియా సమక్షంలో నిర్వహించిన లక్కీ డిప్ లైవ్ కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు.
మొదటి బహుమతి యూరప్ టూర్ ను - పి.లత (కూపన్-నెంబర్ - 0680), రెండవ బహుమతి దుబాయ్ టూర్ ను - కుర్రే నారాయణ (కూపన్-నెంబర్ - 1630), మూడవ బహుమతి శ్రీలంక టూర్ ను- పి.మాధవి (కూపన్-నెంబర్ - 3588), నాల్గవ బహుమతి బ్యాంకాక్ టూర్ ను- ఆళ్ళ శివకుమారి (కూపన్-నెంబర్ - 1141), ఐదవ బహుమతి శ్రీనగర్ టూర్ ను - ఎన్. స్వరూప (కూపన్-నెంబర్ - 3326), ఆరవ బహుమతి చార్ ధామ్ టూర్ ను - దోమ గాయత్రి (కూపన్-నెంబర్ - 2682), ఏడవ బహుమతి తమిళనాడు టూర్ ను - కాంతల మాధవి (కూపన్-నెంబర్ - 3366), ఎనిమిదవ బహుమతి కర్ణాటక టూర్ ను - చీడల్ల నరసింహ రావు (కూపన్-నెంబర్ - 2165), తొమ్మిదవ బహుమతి ఒడిస్సా టూర్ ను- పారిపల్లి శ్వేత (కూపన్-నెంబర్ - 4870) దక్కించుకోగా, పదవ బహుమతి కాశీ-అయోధ్య టూర్ ను -సబ్బెళ్ల సోమిరెడ్డి (కూపన్-నెంబర్ - 2266) దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ... ఆర్.వి సంస్థ ద్వారా చక్కటి సౌకర్యాలను సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా భారీ డిస్కౌంట్లతో పాటు ఇటువంటి టూర్లను ఫ్రీగా అందిచండం చాలా హర్షించదగ్గ విషయమని ఆనందాన్ని వ్యక్తం చేసారు. అలాగే సంస్థ చైర్మన్ ఆర్.వి రమణ మాట్లాడుతూ... ఎంతో ఆధ్యాత్మికత గల భారతదేశంలో గల పుణ్య ప్రదేశాలను చూసే భాగ్యాన్ని ప్రజలకు కలిగించాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే దేశం నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరికి తమ సేవలు అందేవిధంగా తమ సంస్థలను విస్తరింపజేస్తున్నామని అన్నారు. తమ సేవలను ఆదరిస్తూ ఆనందిస్తూ తమను ప్రోత్సహిస్తున్న తమ కష్టమర్లు శ్రేయోభిలాషులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ ఆర్.వి రమణతో పాటు పలువురు ప్రముఖులు, కష్టమర్లు కార్యలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.