calender_icon.png 29 October, 2024 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బంటే ఇష్టమున్న వాళ్లందరికీ లక్కీ భాస్కర్ నచ్చుతుంది

29-10-2024 12:04:50 AM

వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’ను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించారు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘కథని ప్రభావితం చేయకుండా సినిమాలో ఒక్క పాత్ర కూడా లేదు. ప్రతి పాత్రా నా మనసుకు దగ్గరైంది. సినిమా చూసి అందరూ తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్‌లోనుంచి బయటకు వస్తారు’ అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “లక్కీ భాస్కర్’ ఈ మధ్య నేను చూసిన బెస్ట్ ట్రైలర్స్‌లో ఒకటి.

ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘ఇదొక కొత్త ప్రయత్నం. డబ్బంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. అది నేను గ్యారెంటీగా చెబుతున్నా” అన్నారు. ఇంకా ఈ వేడకలో హీరోయిన్ మీనాక్షి చౌదరి, నటుడు హైపర్ ఆది, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.