calender_icon.png 21 December, 2024 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీమతితో లక్కీ భాస్కర్ ప్రేమ రాగాలు

16-10-2024 12:03:32 AM

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శక త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సితార ఎంటర్‌టై న్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 31న దీపావళి కానుకగా లక్కీ భాస్కర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం చిత్ర యూని ట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం లక్కీ భాస్కర్ నుంచి ‘శ్రీమతి గారు’ అనే వీడియో పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా, శ్రీమణి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ ఈ గీతాన్ని ఆలపించారు. 90లో జరిగిన కథ ఆధారంగా సినిమా రూపొందింది.