calender_icon.png 15 April, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్నో హ్యాట్రిక్ విజయం

12-04-2025 07:39:22 PM

లక్నో: ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా వాజ్ పేయి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. 180 పరుగుల లక్ష్యంతో వచ్చిన లక్నో 19.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. లక్నో బ్యాటర్లలో ఐడెన్ మార్క్ రమ్(58), నికోలస్ పూరన్(61) అర్థ సెంచరీలతో చెలరేగారు.

గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 2, రశీద్ ఖాన్, వాషింగ్ టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టంతో 180 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 60 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 56 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, రవి బిష్ణోయ్ 2, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.