28-03-2025 12:37:46 AM
5 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి
దంచికొట్టిన పూరన్, మార్ష్
నేడు చెన్నైతో బెంగళూరు ‘ఢీ’
హైదరాబాద్, మార్చి 27: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయాన్ని అందుకుంది. పూరన్ పూనకానికి తోడు మార్ష్ విధ్వంసం జతవ్వడంతో లక్నో మరో 23 బంతులుండగానే లక్ష్యాన్ని అందుకొని సీజన్‌లో తొలి గెలుపు సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హెడ్ (47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనికేత్ (36) ఆకట్టుకున్నాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు మిచెల్ మార్ష్ (52) అర్థసెంచరీ సాధించాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ (22*), మిల్లర్ (13*) జట్టును విజయతీరాలకు చేర్చారు. కమిన్స్ రెండు వికెట్లు తీశాడు.