calender_icon.png 17 April, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్‌కతాపై లక్నో ఘనవిజయం

08-04-2025 07:38:43 PM

కోల్‌కతా: ఐపీఎల్ 2025 లో ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరిగినా మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)పై లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 4 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా కోల్‌కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో సునీల్ నరైన్(30), అజింక్య రహానే(61), వెంకటేశ్ అయ్యార్(45) చివర్లో రింకు సింగ్(38) రాణించినా విజయాన్ని అందుకోలేకపోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్ దీప్, శార్ధుల్ థాకుర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసినా లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(87), మిచెల్ మార్ష్(81), ఐదెన్ మార్ క్రమ్(47) పరుగులతో చెలరేగారు.