calender_icon.png 22 February, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థిరాస్తులు అటాచ్

21-02-2025 12:56:55 AM

సంగారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని లూసెం ట్ డ్రగ్స్ పైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీకి చెం దిన విలువైన స్థిరాస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం తాత్కాలి కంగా అటాచ్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారులు గు రువారం ప్రకటన విడుదల చేశారు.

ఈ ఫ్యాక్టరీలో గత రెండేళ్ల క్రితం ట్రామడా ల్ అనే మత్తు పదార్థాన్ని తయారు చేసి పాకిస్తాన్ కు అక్రమంగా తరలిస్తుండగా యాంటీ నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. ట్రామడాల్‌ను అక్రమంగా ఎగుమతి చేసిన కేసులో మనీలాండలింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల ప్రకారం రూ.5.67 కోట్లు ఆస్తులు అటాచ్ చేసినట్లు తెలిపారు.