calender_icon.png 18 November, 2024 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ అండ్ టీ లాభం 3,395 కోట్లు

31-10-2024 12:23:42 AM

ముంబై, అక్టోబర్ 30: ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) కన్సాలిడేటెడ్ నికరలాభం ఈ జూలై-సెప్టెంబర్ ద్వితీయ త్రైమాసికంలో 5 శాతం వృద్ధితో రూ. 3,395 కోట్లకు పెరిగింది. నిరుడు ఇదేకాలంలో రూ. 3,223 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని నమోదు చేసింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 52,157 కోట్ల నుంచి రూ. 62,655 కోట్లకు చేరింది.

అంతర్జాతీయ స్థూల ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నా, తాము పటిష్టమైన ఆర్థిక పనితీరును ప్రదర్శించామని ఎల్ అండ్ టీ చైర్మన్, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ. 5 లక్షల కోట్లకుపైగా ఆర్డర్ బుక్ ఉన్నదని తెలిపారు. తాజా త్రైమాసికంలో రూ. 80,045 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయని కంపెనీ సీఎఫ్‌వో శంకర్ రామన్ చెప్పారు. స్వీక్వెన్షియల్‌గా ఆర్డర్లు 13 శాతం పెరిగాయన్నారు.