calender_icon.png 17 January, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షీణించిన ఎల్‌టీ మైండ్‌ట్రీ లాభం

17-01-2025 01:54:29 AM

న్యూఢిల్లీ,  జనవరి 16: ఎల్ అండ్ టీ ఐటీ సబ్సిడరీ  ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ (ఎల్‌మైండ్‌ట్రీ) కన్సాలిడేటెడ్ నికరలాభం క్యూ3లో 7.14 శాతం క్షీణించి రూ.1,085 కోట్లకు తగ్గింది. గత క్యూ3లో రూ.1,169 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ. 9,016 కోట్ల నుంచి రూ. 9,661 కోట్లకు పెరిగింది.

స్వీక్వెన్షియల్‌గా కంపెనీ లాభం 13.23 శాతం తగ్గగా, రెవిన్యూ 2.41 శాతం పెరిగింది. తమ ఏఐ వ్యూహంతో రికార్డుస్థాయిలో 1.68 బిలియన్ డాలర్ల ఆర్డర్లు సంపాదించామని కంపెనీ సీఈవో దేబషిస్ ఛటర్జీ తెలిపారు.