calender_icon.png 15 November, 2024 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ2ఈ నెట్‌వర్క్స్‌లో వాటా కొంటున్న ఎల్ అండ్ టీ

06-11-2024 12:00:00 AM

డీల్ విలువ రూ. 1,407 కోట్లు

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో క్లౌడ్ సర్వీసుల కంపెనీ ఈ2ఈ నెట్‌వర్క్స్‌లో 21 శాతం వాటాను రూ.1,407 కోట్లకు కొనుగోలు చేయనుంది. టెక్నాలజీ రంగానికి కీలక వృద్ధి విభాగాలైన క్లౌడ్, ఏఐ సర్వీసుల్లో ఉనికిని పెంచుకునేందుకు ఈ2ఈతో పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎల్ అండ్ టీ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలిపింది.

ఒప్పందం ప్రకారం 15 శాతం వాటాకు ఎల్ అండ్ టీ రూ. 1,079 కోట్ల పెట్టుబడి చేస్తుంది. రూ. 327.75 కోట్ల విలువైన వాటాను ప్రిఫెరెన్సియల్ అలాట్‌మెంట్ ద్వారా పొందుతుంది. అయితే ఈ2ఈ నెట్‌వర్క్స్ నిర్వహణను చేపట్టదు. మైనారిటీ షేర్‌హోల్డరుగా కొనసాగుతుంది.