calender_icon.png 11 April, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడుగు పొడిగింపు

04-04-2025 12:00:00 AM

గద్వాల, ఏప్రిల్ 3 ( విజయక్రాంతి ): ఎల్ ఆర్ ఎస్ స్కీం క్రింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కొరకు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 30 వరకు అవకాశం కల్పించిందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ గారు జిఓ 182 ను జారీ బుధవారం జారీ చేశారు. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించి న విషయం తెలిసిందే.

ఎస్‌ఆర్‌ఎస్ ఫీజును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగి స్తూ నిర్ణయం తీసుకుంది.  కావున అందరు ప్లాట్ యజమానులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో కోరారు.