23-04-2025 12:21:11 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, ఏప్రిల్ 22 : అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ నిర్ణీత గడువు లోగా సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ నాటితో ఎల్ ఆర్ ఎస్ రాయితీ గడువు ముగుస్తుందని, దానిని పొడిగించబోమని మంత్రి స్పష్టం చేశారు.
అనధికారికంగా లేఅవుట్లు చేసి, అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరిం చుకునే అవకాశం ఉందని కలెక్టర్ సూచించారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని తెలిపారు. క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పఅర్హులైన వారందరు ఏప్రిల్ 30వ తేదీ లోపు క్రమబద్దీకరణ చేసుకోవాలని,,ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ గడువు మార్చి 31తో ముగియగా, ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించిందని అన్నారు. రాయితీ వర్తింపునకు ఇదే చివరి అవకాశం అని కలెక్టర్ స్పష్టం చేశారు.