13-03-2025 12:40:47 AM
డిఐజి మధుసూదన్ రెడ్డి
మేడ్చల్,(విజయక్రాంతి): అనధికార లేఔట్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజి మధుసూదన్ రెడ్డి సూచించారు. బుధవారం మేడ్చల్ లో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారికి 20 శాతం రాయితీ కల్పించిందన్నారు. అనధికార లేఔట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా, విక్రయించకుండా మిగిలిన ప్లాట్లకు ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించిందన్నారు. ఎల్ ఆర్ ఎస్ చేసుకోవడం వల్ల దస్తావేజుల విలువ పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, డాక్యుమెంట్ రైటర్ రకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రిజిస్టర్ సిహెచ్ అశోక్ కుమార్, జిల్లాలోని సభ రిజిస్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.