06-03-2025 12:06:21 AM
కామారెడ్డి, మార్చి 5,(విజయక్రాంతి): జిల్లాలో అనదికార ప్లాట్లు, లే అవుట్లు క్రమబద్ధీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అడ్లూరు గ్రామ శివారులోని మున్సిపల్ వార్డు నెంబర్ 19 లోని సర్వే నెంబర్ 525 లో గల ప్లాట్లను మున్సిపల్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూముల క్రమబద్ధీకరణ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న వారు 25 శాతం రాయితీతో డబ్బులు చెల్లిస్తే సదరు ప్లాట్లను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న అర్జి దారులు రాయితీ రుసుమును చెల్లించి క్రమబద్దీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్, రెవిన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.