22-03-2025 01:52:04 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మార్చి 21 ( విజయక్రాంతి) : అనుమతి లేని, అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లాల వారీగా ఎల్.ఆర్.ఎస్ పురోగతి పై హైదారాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంతకు ముందు 47,974 మంది ఎల్.ఆర్.ఎస్ కొరకు దరఖాస్తు చేసుకోగా వారిలో ఇప్పటి వరకు దాదాపు 37,401మంది ప్లాటు యజమానులకు డబ్బులు కట్టవలసిందిగా కోరుచు నోటీస్ లు జారిచేసినట్లు తెలిపారు.
ఎల్.ఆర్.ఎస్ లేని ప్లాటు యజమానులు 1217 మంది ఇప్పటి వరకు డబ్బులు కట్టినవారికి ప్లాటు క్రమబద్ధీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అక్రమ లే అవుట్ స్థలాల పై చర్యలు సైతం తీసుకోవడం జరుగుతుందని అందువల్ల జిల్లాలోని అక్రమ లే అవుట్ యజమానులు, ప్లాటు కొనుగోలు చేసిన వారు ప్రభుత్వం కల్పిస్తున్న సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయించుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.