calender_icon.png 10 March, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు

09-03-2025 07:26:30 PM

కలెక్టర్ గౌతమ్...

మేడ్చల్ (విజయక్రాంతి): ఎల్ఆర్ఎస్ కు సంబంధించి సందేహాలు నివృత్తి కోసం కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని కలెక్టర్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకానికి సంబంధించి సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ ఉపయోగపడుతుందన్నారు. అన్ని పని దినాలలో ఉదయం 10:30 నుంచి అనంతరం 5:00 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ఎల్ ఆర్ ఎస్ ఫీజు చిల్లింపులకు సంబంధించిన విషయాలపై సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ లోని 94 924 09 781 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.