calender_icon.png 4 April, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ నెలాఖరు వరకు

03-04-2025 01:10:01 AM

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని నెలా ఖరువరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. గతం లో ప్రకటించిన గడువు మార్చి 31 నాటికి ముగిసింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌కు సర్కారు ఆశించినంత స్పందన రాలేదు. మొత్తం మీద 2 లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయ్యాయి. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల కు పైగా ఆదాయం వచ్చింది.

మరో 13 లక్షలకు పైగా దరఖాస్తులు పరిష్కారం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ స్కీం ఈ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు ఇచ్చా రు. ఈ నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేవారికి 25శాతం రిబేట్ దక్కనుంది.