07-03-2025 12:35:16 AM
హుజూర్ నగర్, మార్చి6: ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలోపరిశీలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. గురువారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎల్ ఆర్ ఎస్ కింద ధరఖాస్తు చేసుకున్న లే అవుట్ ని పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ లే అవుట్ లో రోడ్లు, విద్యుత్, పార్క్, డ్రైనేజి లాంటి మౌళిక వసతులు పరిశీలించారు. తదుపరి మున్సిపాల్టీ కార్యాలయం లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాల్టీలో పన్ను వసూలుపై శ్రద్ద పెట్టి వసూల్ చేయాలని, వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకి మెను ప్రకారం నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు.
పదవతరగతి విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని జిల్లాను అగ్రస్థానం లో ఉంచేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి కి స్టడీ మెటీరియల్ పంపించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి శివ , మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ రెహానా , వార్డెన్ మోమినా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.