calender_icon.png 26 February, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి

26-02-2025 12:14:34 AM

కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ఖమ్మం, ఫిబ్రవరి- 25 (విజయక్రాంతి):- మార్చి 31లోపు ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎల్.ఆర్.ఎస్. పై నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్థ్యతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్, సుడా, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను ప్రాసెస్ చేసి పరిష్కరించాలని, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల వద్ద అధికంగా ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, మార్చి 31 లోపు ఎల్.ఆర్.ఎస్.  దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను 3 దశలలో స్క్రూటినీ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం  నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో నరసింహారావు, ఆర్‌ఐలు, అధికారులు పాల్గొన్నారు.