calender_icon.png 30 October, 2024 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్ మళ్లీ షురూ !

02-08-2024 01:28:46 AM

  1. సర్కార్ మార్గదర్శకాలు జారీ 
  2. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిరణ 
  3. మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకర ణకు 2020లో నాటి ప్రభుత్వం సుమారు 25 లక్షల దరఖాస్తులను స్వీకరించింది. క్రమబద్ధీకరణ వ్యవహారం కోర్టుకు చేరడంతో ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా కొత్త ప్రభుత్వం మళ్లీ క్రమబద్ధీకరణకు పూనుకోవడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిం చాయి. అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధ్దీకరణ ప్రక్రియ (ఎల్‌ఆర్‌ఎస్) రాష్ట్రంలో మళ్లీ షురూ అయింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. ఇక నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచే దరఖాస్తులు స్వీకరించునున్నారు.

వాటిని మూడు నెలల్లో పరిష్కరించనున్నారు. దరఖాస్తులను ముందుగా ఆన్‌లైన్‌లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విభాగం పరిశీలిస్తుంది. ఆ తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు బృందం గా క్షేత్రస్థాయిలోకి వెళ్లి స్థలాలు, లేఅవుట్లను పరిశీలిస్తాయి. అభ్యంతరాలు ఉంటే సీజీజీ యాప్‌లో వాటిని నమోదు చేస్తాయి. ఆ తర్వాత దరఖాస్తుదారుకు ఫీజు నిర్ణయించి డిమాండ్ నోటీసులు జారీ చేస్తాయి. నిర్ణీత గడువులోపు డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారుల స్థలాలు, లేఅవుట్లను క్రమబద్ధ్దీకరిస్తాయి.

జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అంతా సాగుతుంది. దరఖాస్తుదారుల అనుమానాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లతో పాటు స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు అందుబాటులోకి రానున్నాయి. హెచ్‌ఎండీఏ, జీహెచ్ ఎంసీ, మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.