calender_icon.png 28 February, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా తక్కువ వాడకం వల్ల ఎంతో మేలు

28-01-2025 05:41:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): యాసంగిలో పంటలు సాగు చేసే రైతులు తక్కువ యూరియాను వాడడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. సోను మండలంలోని సిద్దిలకుంట గ్రామంలో తక్కువ యూరియాతో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతుల పంట పొలాలను మంగళవారం సందర్శించి తక్కువ యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. రైతు పంట సాగుకు తక్కువ యూరియా వాడటం వల్ల భూసారం పరిరక్షణ చేస్తుందని రైతుకు పంట దిగుబడులు కూడా అధికంగానే వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి వినోద్, అశోక్ కుమార్, ప్రగతి తదితరులు పాల్గొన్నారు.